ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

09-10-2026 | 04:24pm

* ఆరేపల్లిలో డీపీఓ యాదయ్య పర్యటన

పాపన్నపేట,అక్టోబర్09: మనం నివసించే ఇల్లు, ఆపీసు పరిసరాలను(Home and office surroundings) పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ) యాదయ్య(Yadayya) సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని ఆరేపల్లి గ్రామంలో(Arepalli Village) పర్యటించారు. పారిశుద్ధ్యం(Sanitation), వీధి దీపాలు, త్రాగునీటిని(Drinking water) పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామంలో ఇంటింటికి ఇంకుడు గుంతలు(Recharge pits) తప్పనిసరిగా నిర్మించేలా గ్రామస్తులను ప్రోత్సహించాలని గ్రామ సర్పంచ్ రజిత రాజశేఖర్, పంచాయతీ కార్యదర్శి రమేష్ కు సూచించారు. అనంతరం గ్రామానికి మంజూరైన కొత్త పెన్షన్లను పరిశీలించారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ రజిత రాజశేఖర్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు తదితరులున్నారు.

మరిన్ని వార్తలు