చర్చి వద్ద 35 రోజులుగా వెలగని వీధి దీపం!

22-11-2026 | 08:26pm

గ్రామసభలో చెప్పినా పట్టించుకోని వైనం

సర్పంచ్‌, కార్యదర్శి నిర్లక్ష్యంపై గ్రామస్తుల ఆగ్రహం

కొల్చారం, నవంబర్ 22 (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలో గ్రామపంచాయతీ పాలన(Gram Panchayat Administration) తీరుపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చర్చి(Church) సమీపంలో గత 35 రోజులుగా వీధి దీపం వెలగకపోవడంతో రాత్రివేళ చీకట్లు(Darkness at night) అలుముకుంటున్నాయి. ఈ సమస్యను గ్రామసభలో ప్రస్తావించినప్పటికీ పరిష్కారం చూపకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు.

వీధి దీపం పనిచేయడం లేదని వార్డు సభ్యుడికి పలుమార్లు తెలియజేసినా పట్టించుకోని పరిస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీలో నిధులు ఉన్నప్పటికీ లైట్‌కు సంబంధించిన ఎంసీబీ ఏర్పాటు చేయకపోవడం, మరమ్మతులు చేపట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు.

ప్రతి గ్రామసభలో కొత్త లైట్లు తెచ్చామని చెబుతున్న నాయకులు, గ్రామంలో నెల రోజులకుపైగా వెలగని వీధి దీపాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. గ్రామసభలో సమస్యలు ప్రస్తావించినా స్పందన లేకుంటే గ్రామసభలు నిర్వహించడం ఎందుకు? అని గ్రామస్తులు నిలదీస్తున్నారు. సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి దీపాన్ని పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు