కనకదుర్గ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా

22-11-2026 | 08:43pm

బోథ్. నవంబర్ 22 ( విజయక్రాంతి): బజార్ హత్ముర్ మండలంలోని(Bazar Hathnur Mandal) కనకాయి వద్ద ఉన్న కనకదుర్గ ఆలయాన్ని(Kanaka Durga Temple) కాంగ్రెస్ పార్టీ(Congress Party) బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్(Aade Gajender) దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో భక్తుల(devotees) సౌకర్యార్థం ఐదు లక్షల రూపాయలతో గ్రావెల్ రోడ్డు వేయించడం జరిగిందన్నారు. అయితే త్వరలోనే మూరవై ఐదు లక్షలు మంజూరు చేసి ఆలయ అభివృద్ధికి భక్తుల(devotees) సౌకర్యం వసతుల కల్పనకు తన వంతు కృషి చేస్తానన్నారు.

ఆయన వెంట బోథ్. బ్లాక్ ఆత్మ చైర్మన్ గొర్ల రాజు యాదవ్ స్థానిక సర్పంచ్ ప్రియాంక భూమేష్ లతోపాటు కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు రాథోడ్ రమేష్. సీనియర్ నాయకులు జాదవ్ గణేష్, మండల మైనారిటీ చైర్మన్ సయ్యద్ సల్మాన్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి గొల్ల నాగు రమేష్ భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు