పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం: నీలం మధు
ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించాలి
పటాన్ చెరు, నవంబర్ 22: చిన్నారుల ఆరోగ్య భద్రతకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, పోలియో రహిత సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి నీలం మధు ముదిరాజ్(Neelam Madhu Mudiraj) అన్నారు. ఆదివారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి చిన్నారులకు రెండు చుక్కల పోలియో వ్యాక్సిన్ వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయించి వ్యాధి నుంచి రక్షణ కల్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేయించుకోకుండా మిగలకూడదని, వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకాలు అందించాలని కోరారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు గోపాల్, దస్తగిరి, నాయకులు అనిల్, శ్రీనివాస్, వైద్య సిబ్బంది, తల్లిదండ్రులు పాల్గొన్నారు.