జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
నిర్మల్ నవంబర్ 22 (విజయక్రాంతి): ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు(Additional Collector Venkata Madhava Rao) అన్నారు. నిర్మల్ రూరల్ మండలం కౌట్ల (కె) గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా శిబిరాన్ని ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బీమా నమోదు తీరును పర్యవేక్షించారు.
ఒక కుటుంబానికి బీమా నమోదు చేయడానికి దాదాపు ఎంత సమయం అవుతుందో స్వయంగా పరిశీలించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బీమా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. స్థానిక అధికారులంతా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం శిబిరాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. ప్రజలంతా ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం కింద నమోదయ్యేలా చొరవ చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు, తహసీల్దార్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.