ప్రజావాణి దరఖాస్తులు పెండింగ్ లేకుండా పరిష్కరించాలి!
ఎంపీడీఓ చిన్న రెడ్డి
చేగుంట , నవంబర్ 2, విజయక్రాంతి: ప్రజావాణి కార్యక్రమంలో('Praja Vani' (Public Voice) Program) ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సంబంధిత అధికారులు సత్వరమే పరిష్కరించాలని చేగుంట ఎంపీడీఓ చిన్న రెడ్డి(Chegunta MPDO Chinna Reddy) అన్నారు . సోమవారం ఎంపీడీఓ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మండల అధికారూలతో కలిసి వివిధ గ్రామాల ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో , వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.