కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా: బీఆర్ఎస్ నాయకులు
20-09-2026 | 05:46pm
బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి
చేగుంట సెప్టెంబర్ 20,విజయక్రాంతి: చేగుంట మండలం మక్కారాజుపేట గ్రామ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు(BRS party Senior leaders) రమేష్ ఇటీవల మరణించారు. ఈ విషయం తెలుసుకొని ఆదివారం వారి కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోలిపేట సతీష్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటానని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నారాయణ రెడ్డి ,గ్రామ సర్పంచ్ సురేష్ రెడ్డి ,మాజీ సర్పంచ్ కుమ్మరి శ్రీను,మాజీ ఎంపీటీసీ బాల్ నర్సిములు,గ్రామ అధ్యక్షులు స్వామి,నాయకులు శివ రాజు,నల్ల ఆంజనేయులు,జునేదు,మహేష్,రాజు,శ్రీనివాస్,ఊరడి యాదగిరి,నవీన్ ,భాను ప్రసాద్,స్వామి,శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.