గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
చేగుంట నవంబర్ 03: గుర్తుతెలియని వాహనం(vehicle) ఢీకొని మృతి చెందిన సంఘటన తూప్రాన్ సమీపంలోని(Near Tupran) హల్దీ బ్రిడ్జిపై(Haldi Bridge) చోటుచేసుకుంది, పోలీసుల వివరాల ప్రకారం చేగుంట పట్టణానికి చెందిన వడ్ల చారి (55) హైదరాబాద్ లో ప్రవేట్ ఆసుపత్రిలో(Private hospital) పనిచేసేవాడు.
రోజు మాదిరిగా తన ద్విచక్ర వాహనం తో చేగుంట నుండి హైదరాబాద్ కు వెళ్తుండగా మార్గమధ్యలోని హల్ది బ్రిడ్జి పైన గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన చేరుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించి కేసు నమోదు చేసి ధర్యాప్తు చేసినట్లు తెలిపారు