బాధిత కుటుంబాలకు పద్మాదేవేందర్‌రెడ్డి అండ

29-09-2026 | 06:41pm

మృతుల కుటుంబాలను పరామర్శించి మనోధైర్యం కల్పించిన మాజీ ఎమ్మెల్యే

పాపన్నపేట: ఆప్తులను కోల్పోయి విషాదంలో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి(Former MLA Padmadevender Reddy) అండగా నిలిచారు. పాపన్నపేట మండలం(Papannapet Mandal)లోని పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను మంగళవారం ఆమె పరామర్శించి బాధితులను ఓదార్చారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకుని, కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచించారు.

గాంధారిపల్లి గ్రామంలో బీఆర్‌ఎస్‌(BRS) నాయకుడు పాశం అంజిరెడ్డి తండ్రి పాశం నాగిరెడ్డి మృతి చెందడంతో ముందుగా ఆయన కుటుంబాన్ని పద్మాదేవేందర్‌రెడ్డి పరామర్శించారు. అనంతరం జయపురం గ్రామంలో ఇటీవల మృతి చెందిన దాసరి కేశయ్య కుటుంబ సభ్యులను, యూసుఫ్‌పేటలో చామంతుల నారాయణ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. కుర్తివాడలో ఏడుపాయల మాజీ డైరెక్టర్‌ మోహనరావు అత్తమ్మ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే గ్రామంలో బీఆర్‌ఎస్‌ కార్యకర్త పుట్టి మల్లేశం మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని కలిసి సానుభూతి తెలిపారు.

ఆప్తులను కోల్పోయిన బాధను పూడ్చలేనప్పటికీ, కష్టకాలంలో కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆమె వెంట పాపన్నపేట మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, మాజీ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు జగన్, సర్పంచ్ సాయిరెడ్డి, మాజీ సర్పంచ్‌ బద్రి మల్లేశం, మాజీ ఎంపీటీసీ మోహన్‌రెడ్డి, నాయకులు కిష్టగౌడ్, శ్రీనివాస్, ఆంథోని, అనిల్‌రెడ్డి, మల్లేశం, విశ్వాసంరెడ్డి, రఘుపతి, మన్నే వెంకటేశం, సిద్దిరామ్‌రెడ్డి తదితరులు, ఆయా గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు