12 లక్షలు డిమాండ్.. ఆరుగురు విడిసి సభ్యులపై కేసు

29-09-2026 | 06:51pm

తలమడుగు,(విజయక్రాంతి): గ్రామ అభివృద్ధి(Village development) పేరుతో వీడీసీలు అక్రమ వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి(Adilabad DSP L. Jeevan Reddy) హెచ్చరించారు. బరంపూర్ గ్రామం(Barampur village)లో అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్నారనే సమాచారంతో తలమడుగు ఎస్‌ఐ డి. రాధిక సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ఆర్లీ-కేకు చెందిన చిత్తల వెంకట్ రెడ్డి (48)ని అదుపులోకి తీసుకుని రూ.3.29 లక్షల విలువైన 454 లీటర్ల 910 ఎంఎల్ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

బెల్ట్ షాపు నిర్వహించేందుకు రూ.12 లక్షలు ఇవ్వాలని ఆరుగురు వీడీసీ సభ్యులు డిమాండ్ చేశారని, అందులో రూ.10 వేలు అడ్వాన్స్‌గా చెల్లించినట్లు నిందితుడు తెలిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో కస్లాల ప్రతాప్, మెర్గు రంజిత్ రెడ్డి, పట్ల నర్సయ్య, మేకల బాపురావు, గణేష్ గౌడ్, మాధురి మల్లేష్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బెల్ట్ షాపులు, ఇసుక అక్రమ రవాణా, కల్లు దుకాణాలు తదితర అక్రమ కార్యకలాపాల పేరుతో ఎవరైనా వసూళ్లకు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ సూచించారు.

మరిన్ని వార్తలు