మండల సమైక్యలో సంస్థల గ్రేడింగ్ విధానంపై ఈసీ సభ్యులకు శిక్షణ

29-09-2026 | 06:48pm

నాగిరెడ్డిపేట, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): మండల సమైక్య కార్యాలయం(Mandal Samakhya Office)లో మండల సమైక్య సభ్యులకు సంస్థల గ్రేడింగ్ విధానంపై ఈసీ సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. స్వయం సహాయక సంఘాలు, గ్రామ సమాఖ్యలు, మండల సమైక్యల పనితీరు, గ్రేడింగ్ విధానం, సంస్థాగత అంశాలపై సభ్యులకు సీనియర్ సీఆర్‌పీలు అనూష హేమావతి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్జి, వివో గ్రేడింగ్ విధానం, గ్రేడింగ్‌లో పరిగణించే అంశాలు, రికార్డుల నిర్వహణ, సమావేశాల నిర్వహణ,పొదుపులు, అంతర్గత రుణాలు, బ్యాంకు లావాదేవీలు, నిధుల వినియోగం తదితర అంశాలను సీనియర్ సీఆర్‌పీలు వివరించారు.

అలాగే ఇడిల్ ఫండ్స్,షేర్ క్యాపిటల్, క్యాపిటల్ కాంట్రిబ్యూషన్, సర్ప్లస్, ఎస్హెచ్జి, వివో, ఎంఎస్ స్థాయిలలో నిధుల నిర్వహణ, సంస్థల పనితీరును మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై శిక్షణ ఇచ్చారు. గ్రేడింగ్ ద్వారా సంస్థల బలాలు,లోపాలను గుర్తించి అవసరమైన సూచనలు, సలహాలు అందించడం ద్వారా పనితీరును మరింత మెరుగుపరచుకోవాలని సూచించారు. సమైక్య సభ్యులు శిక్షణలో చురుకుగా పాల్గొని, గ్రేడింగ్‌కు సంబంధించిన అంశాలపై సీనియర్ సీఆర్‌పీలను అడిగి సందేహాలను నివృత్తి చేసుకున్నారు. 

“గ్రేడింగ్‌ను అర్థం చేసుకుందాం – పనితీరును మెరుగుపరుచుకుందాం” అనే లక్ష్యంతో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు ఏపీఎం దత్తు  తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనిధి రీజనల్ మేనేజర్ కిరణ్ కుమార్, ఏపీయం దత్తు, మండల సమైక్య కార్యదర్శి మంజుల,కోశాధికారి భాగ్యలక్ష్మి,సీసీలు రవి, పెంటయ్య,రాజయ్య, సావిత్రి,రాజు,స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ అమల, అకౌంటెంట్ రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు