సంఘం బలోపేతానికి సంక్షేమానికి ఐక్యతే మార్గం

29-09-2026 | 06:33pm

హన్వాడ సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): సంఘ బలోపేతానికి సంక్షేమానికి ఐక్యతే మార్గమని హన్వాడ మండల(Hanwada Mandal) నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు చుక్కల నరేష్ కుమార్ అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల పరిధిలో గల నాయీ బ్రాహ్మణ సేవా సంఘ భవనంలో గొండ్యాల రామకృష్ణ అధ్యక్షతన సర్వసభ్య సమావేశంలో మంగళవారము మండల అధ్యక్షుడు నరేష్ కుమార్ మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణ కుల బాంధవులందరినీ ఒకే వేదిక పైకి తీసుకురావడానికి కుల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.

మన హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక సమగ్రత కోసం కుల ఐక్యతే ప్రధానమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో సంఘం ద్వారా అందించే సహాయ సహకారాలు, పథకాలు గుర్తింపు పొందే లబ్ధి కేవలం ప్రాథమిక సభ్యత్వం ఉన్న వారికే ప్రాధాన్యత ప్రకారం వర్తిస్తాయని తెలిపారు. అనంతరం కోశాధికారి ఎం బాలరాజు మాట్లాడుతూ మండల పరిధిలో గల గ్రామ యువత, ప్రతి ఒక్క నాయి బ్రాహ్మణ సంఘీయులు బాధ్యతగా సభ్యత్వం తీసుకొని కుల సంఘాన్ని బలోపేతం చేయడానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  గౌరవాధ్యక్షుడు పాండరయ్య, సలహాదారుడు చుక్కల వీరేష్ కుమార్, మునిమోక్షం బాబయ్య, కృష్ణయ్య, రమేష్ కుమార్, తిరుపతయ్య, అశోక్, సత్యనారాయణ, శ్రీనివాసులు, ఎన్ ఆంజనేయులు, వెంకటయ్య, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు