కుర్తివాడలో డీపీఓ యాదయ్య ఆకస్మిక పర్యటన
* గ్రామపంచాయతీ, నర్సరీ, పాఠశాల సందర్శన
* పాఠశాలలో మధ్యాహ్న భోజనం రుచి చూసిన డీపీఓ
పాపన్నపేట,సెప్టెంబర్19: మండల పరిధిలోని కుర్తివాడ గ్రామంలో జిల్లా పంచాయతీ అధికారి (DPO) యాదయ్య శనివారం పర్యటించారు. స్థానిక సర్పంచ్, జిల్లా సర్పంచ్‌ల ఫోరమ్ ఉపాధ్యక్షులు చెట్టుకింద శ్రీధర్‌తో కలిసి గ్రామపంచాయతీ కార్యాలయం, నర్సరీ, ప్రభుత్వ పాఠశాలను సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని డీపీఓ యాదయ్య స్వయంగా రుచి చూసి భోజనం నాణ్యత, పరిశుభ్రతపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం నర్సరీని పరిశీలించి మొక్కల పెంపకం, సంరక్షణపై వివరాలు తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులపై సర్పంచ్ శ్రీధర్‌తో చర్చించారు. గ్రామాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతి నిధులు సమన్వయంతో పని చేయాలని డీపీఓ సూచించారు. ఆయన వెంట పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రావు, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జనార్దన్, ఉపాధ్యాయులు, తదితరులున్నారు.