గణపయ్య మండపం వద్ద అన్నప్రసాద వితరణ

21-09-2026 | 08:40pm

పాపన్నపేట: మండల కేంద్రం పాపన్నపేట(Papannapet)లోని హనుమాన్ బాల గణేష్ యూత్(Hanuman Bala Ganesh Youth) ఆధ్వర్యంలో వినాయకుడి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన  మండపంలో కొలువు దీరిన గణపయ్యకు అర్చకులు దిగంబర శర్మ విశేష పూజలు నిర్వహించారు. వంజరి ప్రకాశం ఆధ్వర్యంలో సోమవారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని(Distribution of Annaprasadam) చేపట్టారు. యూత్ సభ్యులు అభిలాష్, సాయి, మహానంది, నితీష్, విష్ణు, భాను ప్రసాద్, శివకృష్ణ, సాత్విక్, ప్రశాంత్, నాగరాజు, అజయ్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు