టీబీ ముక్త్ భరత్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్

09-10-2026 | 11:41am

చేగుంట,(విజయక్రాంతి): మెదక్ కలెక్టరేట్‌(Medak Collectorate)లో నిర్వహించిన 'టీబీ ముక్త్ భారత్ అభియాన్'(TB Mukt Bharat Abhiyan) కార్యక్రమంలో చేగుంట సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 2030 నాటికి క్షయ రహిత సమాజాన్ని నిర్మించాలనే సంకల్పంతో డీఆర్‌వో అంబాదాస్ రాజేశ్వర్‌(DRO Ambadas Rajeshwar)తో కలిసి ఆమె కూడా టీబీ నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా గ్రామీణ స్థాయిలో టీబీపై విస్తృత అవగాహన కల్పించి, బాధితులకు అండగా నిలవడానికి పంచాయతీ పాలకవర్గం తరఫున పూర్తి సహకారం అందిస్తామని ఆమె తెలిపారు.

మరిన్ని వార్తలు