20న పాలిటెక్నిక్ కళాశాలకు సింగరేణి ఎడ్యుకేషన్ జీఎం

20-11-2026 | 12:45am

విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం

శ్రీరాంపూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాలకు ఈ నెల 20న సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ జనరల్ మేనేజర్ (జీఎం) రాజేంద్రప్రసాద్ రానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కళాశాల విద్యార్థుల తల్లిదండ్రులతో విద్యార్థుల విద్యాప్రగతి, ఫలితాలు, క్రమశిక్షణ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం రూపొందించాల్సిన ప్రణాళికలపై చర్చించనున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై సలహాలు, సూచనలు అందించాలని కళాశాల ప్రిన్సిపల్ కోరారు.

మరిన్ని వార్తలు