అంగరంగ వైభవంగా సింగరేణి బతుకమ్మ వేడుకలు
నస్పూర్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా(Mancherial District) శ్రీరాంపూర్ సింగరేణి ఆధ్వర్యంలో కృష్ణ కాలనీ(Krishna Colony)లోని శాంతి స్టేడియంలో ఆది వారం బతుకమ్మ సంబరాలు(Bathukamma Celebrations) ఘనంగా నిర్వహించారు. సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వేదికలో బతుకమ్మ ఆటా పాటలతో పెద్ద సంఖ్యలో సింగరేణి ఉద్యోగులు(Singareni Employees), కుటుంబ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. జీఎం మునిగంటి శ్రీనివాస్(GM Muniganti Srinivas), సేవా అధ్యక్షురాలు ఉమారాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని సింగరేణి ఫ్యామిలీ డే, బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు.
శ్రీరాంపూర్ ఏరియా వ్యాప్తంగా మహిళలు రంగు రంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో చేరుకొని ఉత్సాహంగా బతుకమ్మ ఆట ఆడారు. తీరొక్క పూలతో వివిధ ఆకృతులతో పేర్చిన బతుకమ్మలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సింగరేణి సంస్థ ప్రతి ఏటా ఉద్యోగులతో ఫ్యామిలీ డే బతుకమ్మ ఆట పాట వేడుకలు నిర్వహిస్తుందన్నారు. పూలను పూజించే ప్రకృతి పండుగ ప్రపంచంలో ఒక్క మన తెలంగాణ సంస్కృతిలో మాత్రమే భాగంమని, తెలంగాణ మహిళ సోదరీమణులకు ఇదే అతి పెద్ద పండుగ అన్నారు.
ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రతీ ఒక్కరికే ఏ చిన్న అసౌకర్యం కలగకుండా త్రాగునీరు, మొబైల్ టాయిలెట్స్, అంబులెన్స్, ఎమెర్జన్సీ వైద్యసేవలు అందుబాటులో ఉంచామన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించటం మహిళా సోదరీమణులకు సింగరేణి సంస్థ ఇచ్చే గౌరవమన్నారు. వేదికకు మొదటగా చేరుకున్న బతుకమ్మతో పాటు, ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం బ్రాంచి సెక్రెటరీ బాజీ సైదా, డీజీఎం(పర్సనల్) అనిల్ కుమార్, ఇంచార్జ్ ఎస్ ఓ టు జీఎం A V రెడ్డి, సివిల్ హెచ్ ఓ డీ రవి కుమార్, డీ వై పీఎం క్రాంతి కుమార్,అధికారులు, ఉద్యోగులు , కుటుంబ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.