కల్లబొల్లి మాటల ప్రభుత్వం కాదూ..
బెల్లంపల్లి: గత ప్రభుత్వం వలె కల్లబొల్లి మాటలతో మోసం చేసే ప్రభుత్వం కాదని, చేతలు, అభివృద్ధి లక్ష్యంగా ప్రజాపాలన ప్రభుత్వమని బెల్లంపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ దావస్వాతి రమేష్ బాబు(Municipal Chairperson Davaswathi Ramesh Babu) అన్నారు. సోమవారం పట్టణం లోని బూడిదగడ్డ బస్తీలో ఇందిరమ్మ కుటుంబాల భీమా పథకం నమోదు కార్యక్రమంలో ఆమె పాల్గొనీ మాట్లాడారు. ప్రతీ ఇందిరమ్మ కుటుంబానికి భీమా తో భద్రత కల్పించడమే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య ఉద్దేశమని తెలిపారు. భీమా సదుపాయాన్ని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలన అందిస్తున్నాదని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధిలో సీఎం రేవంత్ రెడ్డి ముందు వరుసలో ఉన్నాడని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చెయడమే ప్రభుత్వం కర్తవ్యంగా ముందుకు వెళుతున్నదని వెల్లడించారు. అభివృద్ధిలో దూసుకు పోతుందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ మూకలు దుమ్మెత్తిపోస్తున్నారని ద్వజమెత్తారు. గత ప్రభుత్వం అభివృద్ధి కంటే స్కాములే పాల్పడిందని విమర్శించారు. పదేళ్లలో పాలనంతా అవినీతి, అక్రమాలతోనే సాగిందని తెలిపారు. ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మునిసిపల్ మాజీ చైర్ పర్సన్ మునిమంద స్వరూప, కాంగ్రెస్ నాయకులు ముని మంద రమేష్, నాయకులు పీక లక్ష్మణ్, దామర శ్రీనివాస్, దూడపాక బలరాం, రమేష్, మహిళలు పాల్గొన్నారు.