ప్రజలు నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలి
ప్రజాదివాస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
ప్రజాదివాస్ కు 13 ఫిర్యాదులు
భూపాలపల్లి టౌన్, నవంబర్ 23 (విజయక్రాంతి): ప్రజలు నిర్భయంగా పోలీస్ సేవలు వినియోగించుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(SP Sirisetti Sankeerth) అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదివాస్ కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి నేరుగా 13 ఫిర్యాదులను స్వీకరించారు.
ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్ల సీఐలు, ఎస్‌ఐలకు నేరుగా ఫోన్ చేసి మాట్లాడి ఫిర్యాదుల వివరాలను తెలియజేస్తూ, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి పైరవీలు, మూడో వ్యక్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీసులను సంప్రదించి తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు. ప్రతి ఫిర్యాదుపై చట్టపరిధిలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.