రాళ్లవాగు బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎంఎల్ఏ

22-10-2026 | 04:07pm

మంచిర్యాల స్పోర్ట్స్, (విజయక్రాంతి) : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాళ్లవాగు బ్రిడ్జి నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో కలిసి మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు(MLA Kokkirala Prem Sagar Rao) గురు వారం పరిశీలించారు.

బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ప్రజలకు, వాహనదారులకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాత్కాలికంగా మట్టి రోడ్డును ఏర్పాటు చేయాలని R&B అధికారులకు, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. 

ఎంఎల్ఏ వెంట మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మంచిర్యాల జిల్లా RGPRS అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి,  కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.

మరిన్ని వార్తలు