జిల్లా జట్టుకు మంచిర్యాల విద్యార్థులు
11-10-2026 | 10:35pm
మంచిర్యాల స్పోర్ట్స్, అక్టోబర్ 11: మంచిర్యాల మోడల్ స్కూల్(Mancherial Model School) విద్యార్థులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కబడ్డీ జట్టుకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్న తెలిపారు. కళాశాలకు చెందిన కె. సాయి, సృజన, కె. శరణ్య, శివలు సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో జరిగే అండర్-19 ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి బాలబాలికల కబడ్డీ పోటీలలో(Kabaddi competition) పాల్గొంటారన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టుకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ ముత్యం బుచ్చన్నతో పాటు ఫిజికల్ డైరెక్టర్ ఎన్. సుదీప్, డీఐఈఓ అంజయ్య, ఎస్‌జీఎఫ్ అండర్-19 సెక్రటరీ బాబురావు, ఉపాధ్యాయులు అభినందించారు.