శంషాబాద్‌ నుంచి ఢిల్లీకి కాంగ్రెస్ ప్రతినిధి బృందం

11-10-2026 | 06:50pm

శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనం

హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌(Mahesh Kumar Goud)తో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress party leaders) ఢిల్లీకి(Delhi) బయలుదేరారు. వీరంతా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport) నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు.

రాష్ట్రానికి చెందిన పలువురు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మరిన్ని వార్తలు