గోవా టు హైదరాబాద్.. వెనుక ఎవరున్నారు.?
హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్(Drug Supply Network)పై పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. గోవా–హైదరాబాద్ మధ్య సాగుతున్నట్లు గుర్తించిన డ్రగ్స్ రాకెట్(Drug Racket) గుట్టును రట్టు చేశారు. ఈ కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న క్రిస్టీని పోలీసులు అరెస్ట్ చేశారు. గోవాలో ఈగల్ ఫోర్స్(Eagle Force), పంజాగుట్ట పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్(Joint Operation) నిర్వహించారు.
పంజాగుట్టలో గతంలో పట్టుబడిన ఓ నిందితుడి నుంచి సేకరించిన సమాచారంతో దర్యాప్తు చేపట్టగా, ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన గోవా లింకులు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
నిందితుడి సమాచారంతో గోవాలో ఉన్న సంబంధాలను గుర్తించిన పోలీసులు, రాకెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్న క్రిస్టీని అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మరెవరైనా పాల్గొన్నారా? డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్ ఎంతవరకు విస్తరించింది? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు(Investigation) కొనసాగిస్తున్నారు. గోవా నుంచి హైదరాబాద్‌కు సాగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ డ్రగ్స్ నెట్‌వర్క్‌పై పోలీసుల తదుపరి చర్యలు ఆసక్తికరంగా మారాయి.