విశాఖలో గోల్డ్ సీజ్.. ఎంతంటే

11-10-2026 | 02:41pm

విశాఖపట్నంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు భారీగా విదేశీ బంగారాన్ని పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్నట్లు అనుమానిస్తున్న 5.83 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.8.98 కోట్లు ఉంటుందని అంచనా.. కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు కారులో బంగారాన్ని తరలిస్తున్న సమయంలో డీఆర్‌ఐ అధికారులు పట్టుకున్నట్లు సమాచారం. ముందస్తుగా అందిన నిర్దిష్ట సమాచారం(Specific Intelligence)తో అప్రమత్తమైన అధికారులు జాతీయ రహదారిపై నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీ మొత్తంలో విదేశీ బంగారం బయటపడింది.

విదేశీ బంగారం తరలింపునకు సంబంధించి అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారంపై తదుపరి విచారణ(Investigation) చేపట్టే అవకాశం ఉంది. ఇంత భారీ విలువైన బంగారం పట్టుబడటంతో ఈ వ్యవహారం ప్రాధాన్యం సంతరించుకుంది. బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? రవాణా వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు