కాకా ఫ్రీ కోచింగ్ సెంటర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
09-10-2026 | 10:37pm
చెన్నూర్,( విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో కాకా ఫ్రీ కోచింగ్ సెంటర్‌లో(Kaka Free Coaching Center) శుక్రవారం ఘనంగా బతుకమ్మ వేడుకలను(Bathukamma celebrations) నిర్వహించారు. ‘కాకా ఫ్రీ కోచింగ్ సెంటర్ లో ఆటపాటలతో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆడపడుచులు ఎంతో ఉల్లాసంగా బతుకమ్మ పాటలతో ఆడిపాడరు. రంగురంగుల పూలతో రకరకాల అలంకారాలతో బతుకమ్మలను తీర్చిదిద్దారు. మహిళలు, విద్యార్థినులు సాంప్రదాయ పాటలు కోలాటాలతో ప్రాంగణమంతా సాంస్కృతిక వైభవం సంతరించుకుని సందండిగా మారింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.