ఎస్సి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మంత్రి గోపీకృష్ణ

29-09-2026 | 07:31pm

కోటపల్లి, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల జిల్లా ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శిగా శెట్‌పల్లి సర్పంచ్ మంత్రి గోపీకృష్ణ(Manthri Gopikrishna) నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల హక్కుల కోసం దూకుడుగా పనిచేస్తామని స్పష్టం చేశారు.

తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎస్సి సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథరెడ్డి, జిల్లా ఎస్సి సెల్ చైర్మన్ పైడిమల్ల నర్సింగ్లకు గోపీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. “నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతా” అని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు