బహుజనుల హక్కుల కోసం పోరాడిన గొప్ప నాయకుడు పండుగ సాయన్న

19-10-2026 | 05:31pm

బోథ్ అక్టోబర్ 19 (విజయక్రాంతి): బహుజనుల హక్కుల కోసం పోరాడి దారుణ హత్యకు గురైనా పండుగ సాయన్న(Panduga Sayanna) 174 జయంతికి సంబంధించిన వాల్ పోస్టర్లను బోథ్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శైలేంద్ర శివయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పండుగ సాయన్న జయంతిని ఈనెల 22 రవీంద్రభారతిలో అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం హాజరవుతున్నందున ముదిరాజ్ సహోదరులంతా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తరలి వెళ్లాలన్నారు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జయంతి వేడుకలు జరుగుతాయన్నారు.

ముదిరాజులను బిసిడి నుండి బీసీఏలోకి మారుస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన జీవో 15 యాదావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముదిరాజుల  దైవమైన పెద్దమ్మ తల్లి గుడులనిర్మాణానికి ప్రభుత్వం స్థలాలు కేటాయించాలన్నారు. మండలంలోని పోచెర గ్రామంలో పెద్దమ్మ ఆలయ నిర్మాణంలో ఉన్న సమస్యను పరిష్కరించాలని స్థానిక తహసిల్దార్ సుభాష్ చంద్రకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కంచం లక్ష్మణ్, ముదిరాజ్ ఉద్యోగుల విభాగం కన్వీనర్ నవ్వబోయిన చిన్నయ్య, జెట్టి రాజేశ్వర్, గోనెల భోజరాజు, సున్నం శ్రీనివాస్, పూన స్వామి గుండ్ల పోతన్న నాయుడు శ్రీనివాస్ అయినవేణి నరసయ్య, కటారి రవి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు