దసరా వేళ.. గుమ్మడికాయలకు భారీ డిమాండ్!
నిజామాబాద్ మార్కెట్లలో జోరుగా విక్రయాలు
బోధన్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): దసరా పండుగ నేపథ్యంలో నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలోని మార్కెట్లు సందడిగా మారాయి. పండుగను పురస్కరించుకుని వాహనాలు, దుకాణ సముదాయాలు, ఇళ్ల వద్ద దిష్టి నివారణ కోసం బూడిద గుమ్మడికాయలను వేలాడదీయడంతో పాటు పగలగొట్టేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో మార్కెట్లలో గుమ్మడికాయల విక్రయాలు భారీగా పెరిగాయి.
మార్కెట్లో గుమ్మడికాయ ధరలు రూ.200 నుంచి పలుకుతుండటంతో వ్యాపారులు విక్రయాల్లో బిజీగా కనిపిస్తున్నారు. మార్కెట్ పరిసరాల్లో ఎటు చూసినా గుమ్మడికాయలే దర్శనమిస్తున్నాయి. దసరా పండుగ సంప్రదాయాల్లో భాగంగా గుమ్మడికాయలకు డిమాండ్ పెరగడంతో మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి.