6 గ్యారంటీలపై బిఆర్ఎస్, బిజెపి తప్పుడు ప్రచారం మానుకోవాలి
చెన్నూర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారంటీలపై బిఆర్ఎస్, బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం మానుకోవాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పాతర్ల నాగరాజు(Senior Congress leader Patharla Nagaraju) అన్నాడు. గురువారం ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండున్నర సంవత్సరాలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేస్తూ ముందుకు వెళ్తూ వుంటే, దాన్ని జీర్ణించుకోలేక ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డాడు.
మహిళలాకు ఉచిత బస్సు సౌకర్యం మొదలుకొంటే పక్కా ఇల్లు, ఉచిత కరెంట్, రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ, సన్నవడ్లకు క్వింటాలుకు 500 బోనస్, రైతు భరోసా కింద ఎకరానికీ పెట్టుబడి సాయం రూ. 12 వేలు, ఆరోగ్యశ్రీ పథకంలో రూ. 5 లక్షలు పరిమితిని రూ. 10 లక్షలు పెంచింది నిజం కాదా అని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారాలు చేయడం మానుకోకపోతే ప్రజలే బిఆర్ఎస్, బిజెపి నాయకులకు బుద్ది చెపుతారని హెచ్చరించారు.