నేడు మండల స్థాయి సర్వసభ్య సమావేశం

11-09-2026 | 12:03am

తలకొండపల్లి,(విజయక్రాంతి): తలకొండపల్లి మండల ప్రజా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో మండల స్థాయి సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు తలకొండపల్లి ఎంపీడీఓ సీతారామమ్మ(Talakondapally MPDO Seetharamamma)  గురువారంఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆదేశాల మేరకు నేడు ఉదయం 9 గంటలకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి మండలంలోని సర్పంచులు, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశించారు.

మరిన్ని వార్తలు