చిన్న ఆర్ట్స్ కార్యాలయంపై దాడి

11-09-2026 | 12:00am

స్థల వివాదంతో దౌర్జన్యంగా కూల్చివేతలు 

రూ. 50 లక్షల ఆస్తి నష్టం జరిగిందంటున్న బాధితుడు 

దోమలగూడ అరవింద్ నగర్ నెలకొన్న ఉద్రిక్తత

ముషీరాబాద్, సెప్టెంబరు 10 (విజయక్రాంతి): కవాడిగూడ డివిజన్ దోమలగూడ అరవింద్ నగర్ కాలనీలో స్థల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం11 గంటల సమయంలో సుమారు పదిహేను మంది వ్యక్తులు చిన్నా ఆరట్స్ కార్యాలయం(Chinna Arts office)పై దాడికి పాల్పడి గోడలను, గడ్డపారలు ఇను వ వస్తువులను ధ్వసం చేసినట్లు నిర్వాహకుడు చిన్నాఆరట్స్ అధినేత హర్ణ చందర్ రావు ఆరోపించారు.

కిటికీలు పెకిలించి కార్యాలయం చుట్టూ ఉన్న సామాగ్రిని అక్రమంగా తొలగించారని తెలిపారు. కూల్చివేతల సందర్భంగా రూ. 50 నుంచి 60 లక్షల ప్రింటింగ్ మిషన్ ధ్వంసమైందని ఆరోపించారు. ఇందుకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. గత నలబై సంవత్సరాల నుంచి దోమలగూడ అరవింద్ నగర్ కాలనీలో చిన్నా ఆరట్స్ పేరుమీద కార్యాలయం ఏర్పాటు చేసి పలువురికి ఉపాధి కల్పిస్తూ తాను జీవనం సాగిస్తున్నాడు.

అయితే గత ఆరునెలల క్రితం ఈ స్థలాన్ని స్థల యజమాని పాశం అనిల్ కుమార్ యాదవ్ అదే ప్రాంతానికి చెందిన రవీందర్ అనే వ్యక్తికి విక్రయించా డు. అయితే అప్పటికే స్థలంలో ఉన్న చిన్నా ఆరట్స్ అధినేత పూర్ణచందర్ రావు తన షాపు నిర్వహించూకుంటూ కార్యకలపాలు నిర్వహిస్తున్నాడు. స్థలాన్ని కొనుగోలు చేసిన స్థల యజమాని రవీందర్ తాను ఈ స్థలం కొనుగోలో చేశానని ఖాళీ చేయాలని ఆయ న కోరారు. అయితే ఆయన ఆరునెలల సమయం కోరాడు. అయితే ఆరునెలలు గడిచినా నిర్వాహకుడికి మరో స్థలం దొరకకపోవడంతో అక్కడే తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు.

గత రెండునెలల నుంచి స్థలం కొనుగోలు చేసిన యజామానికి కూడా ప్రతినెలా నిర్వాహకుడు అద్దె చెల్లిస్తూ వస్తున్నాడు. ఈ విషయంపై స్థలంలో ఉన్న షెటర్ ఖాళీ చేయకపోవడంతో ఇరువార్తల మద్య గొడవ జరిగింది. ఇటీవల దోమలగూడ పోలీసేస్టేషన్ లో ఒకరిపై ఒకరు పిర్యాదు చేసుకున్నారు. అయితే పోలీసులు సివిల్ మ్యాటర్ లో తాము జోక్యం చేసుకోలేమని మీరు పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకొని సమస్యను పరిస్కరించుకోవాలని వారి ఇరువురికి పోలీసులు సూచించారు.

సమస్య పరిష్కారం కాకపోవడంతో స్థలాన్ని కొనుగోలు చేసిన స్థల యజామాని గురువారం ఉదయం11 గంట ల సమయంలో నిర్వాహకుడు పూర్ణచందర్ రావు లేని సమయంలో కొంతమంది వ్యక్తులను తీసుకువచ్చి స్థలంలో ఉన్ననిర్మాణాలను కూల్చి వేయించడంతో అరవింద్ నగర్ కాలనీలో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొం ది. ఈ సందర్భంగా తాను లేని సమయంలో తమ కార్యాలయాన్ని ధ్వంసం చేసి లక్షలాదిరూపాయల నష్టం చేశారని పూర్ణచందర్ రావు ఆరోపించారు. వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన దోమలగూడ పోలీసులను కోరారు.

ఇదిలా ఉండగా స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి రవీందర్ మీడియాతో మాట్లాడుతూ గత ఆరు నెలల క్రితం స్థల యజమాని పాశం అనిల్ కుమార్ వద్ద కొనుగోలు చేశానని అప్పటి నుంచి ఖాళీ చేయమంటే ఖాళీ చేయడం లేదని, తన వద్ద అన్ని డ్యాక్యుమెంట్లు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై దోమలగూడ సిఐ అంజద్ అలీని వివరణ కోరగా కోర్టు అనుమతి లేకుండా దౌర్జన్యంగా కార్యాలయాన్ని కూల్చడం నేరమని, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి కార్యాలయంపై దాడికి పాల్పడినవారిపై చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు