దళితులు అడుగుపెట్టిన ప్రాంతాన్ని ‘శుద్ధి’ చేయడమా..?

11-09-2026 | 12:13am

బీఆర్‌ఎస్‌ అంటరానితనపు మనస్తత్వంపై ఉమ్మడి అదిలాబాద్  జిల్లాలో పోలీస్ స్టేషన్ లలో ఫిర్యాదులు చేయాలి

బొమ్మ మహేష్ కుమార్ గౌడ్

టీపీసీసీ ఎస్ సి డిపార్ట్మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ కి ఆదేశాలు

ఉట్నూర్,(విజయక్రాంతి): అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజున శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar)పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు(MLC Tata Madhu) చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించిన విషయంపై కాంగ్రెస్ ఎస్సీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమం నిర్వహించిన అనంతరం, కేసీఆర్ ఫామ్‌హౌస్(KCR Farmhouse) వద్ద బీఆర్‌ఎస్‌ నాయకులు రహదారులపై పసుపు నీళ్లు చల్లడం, పాలతో రోడ్లను కడగడంతో పాటు ‘శుద్ధి’ కార్యక్రమం నిర్వహించడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud) అన్నారు. 

గురువారం కవ్వంపల్లి  సత్యనారాయణ తో  కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం  నాయకులు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కలిశారు. ఈ సందర్భంగా ఎస్సీ విభాగం నాయకులతో  ఆయన కొన్ని విషయాలు మాట్లాడారు. పలు సూచనలు చేశారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో  దళితులు పాల్గొన్న స్థలంలో  శుద్ధి కార్యక్రమం నిర్వహించారని ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో  ఆందోళన కార్యక్రమంలో చేపట్టడంతో పాటు  శుద్ధి కార్యక్రమంలో  పాల్గొన్న వారిపై  పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని  రాష్ట్ర ఎస్సీ విభాగం  వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ ఆదేశించారు.

ఈ శుద్ధి కార్యక్రమంలో శ్రీమతి పావని గౌడ్, ఇక్బాల్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, కొంపల్లి మహేష్, బుద్ధ నాగరాజ్, తదితరులు పాల్గొన్నట్లు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఈ సందర్భంగా దుర్గం శేఖర్ మాట్లాడుతూ... దళిత నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించిన ప్రాంతాన్ని శుద్ధి చేయడం అంటరానితనం, సామాజిక వివక్షను ప్రోత్సహించే భావజాలానికి నిదర్శనంగా కనిపిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, గౌరవం కల్పిస్తున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలకు ప్రజాస్వామ్య సమాజంలో స్థానం ఉండకూడదని స్పష్టం చేశారు.

రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను గౌరవించడం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని వారు పేర్కొన్నారు. రాజకీయ విభేదాలను ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యక్తం చేయాలి తప్ప, దళితులను లేదా ఏ సామాజిక వర్గాన్నైనా అవమానించే విధంగా చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్న వారితో పాటు, ఈ చర్యకు బాధ్యులైన బీఆర్‌ఎస్‌ నాయకులపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేయాలని, ఈ ఘటనను నిరసిస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్  కవ్వం పల్లి సత్యనారాయణ టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ ఆదేశాలు జారీ చేశారు.

పీసీసీ అధ్యక్షుడు, ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్సీ డిపార్ట్‌మెంట్ నాయకులు సమన్వయంతో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడంతో పాటు, అంటరానితనం, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. రాజ్యాంగ విలువలు, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రతి మనిషి గౌరవాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ నిరంతరం పోరాడుతుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర నాయకులు అరేపల్లి రాజేందర్, పరశురామ్, చంద్రశేఖర్, గుర్రం కోటేష్, నిఖిల్, చిరంజీవి, హైమావతి, స్వాతి, జీవనజ్యోతి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు