నిరుపేదల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ భరోసా
11-09-2026 | 12:24am
- ఎమ్మెల్సీ యాదవ రెడ్డి
గజ్వేల్: కొండపాక మండలం(Kondapaka Mandal) గిరాయిపల్లి గ్రామానికి చెందిన సందనబోయిన నర్సింలుకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కును(CMRF check) ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి(MLC Dr. Yadava Reddy) గురువారం గజ్వేల్లో అందజేశారు. ఈ సందర్భంగా యాదవ రెడ్డి మాట్లాడుతూ... ఖరీదైన వైద్యం చేయించుకోలేని నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక భరోసాగా నిలుస్తోందన్నారు.
గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వ హయాంలోనూ సీఎంఆర్ఎఫ్(CMRF) ద్వారా అనేక మంది పేదలకు ఆర్థిక సాయం అందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ కొలిచేలిమి స్వామి, కర్ణాకర్, కనకరాజు పరుశురాం, తుమ్మ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.