పెద్దదర్పల్లిలో ఉపాధి పనులపై సామాజిక తనిఖీ

03-11-2026 | 08:39pm

హన్వాడ: మండలంలోని పెద్దదర్పల్లి గ్రామ పంచాయతీ(Peddaderpally Gram Panchayat)లో 2025 ఏప్రిల్ 5 నుంచి 2026 మార్చి 31 వరకు చేపట్టిన వి.బి.-జి రామ్ జి పనులపై 16వ విడత సామాజిక తనిఖీ గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ గుముడాల దీప్తి రఘురాం గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభివృద్ధి పనులు, కూలీల చెల్లింపులు, సామగ్రి కొనుగోళ్లు, హాజరు పట్టికలను పరిశీలించారు. సామూహిక వృక్షారోపణ క్షేత్రాలను సందర్శించి పనుల అమలును తనిఖీ చేశారు. ప్రభుత్వ నిధులు పారదర్శకంగా వినియోగించాలని సర్పంచ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ భరత్ యాదవ్, అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు