అర్చకుల సర్వసభ్య సమావేశం
కొడిమ్యాల నవంబర్ 3 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల,మల్యాల మండలాల ధూపదీప నైవేద్యం అర్చకుల సర్వసభ్య సమావేశం(General Body Meeting of Priests) మంగళవారం కొడిమ్యాల మండల కేంద్రంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ(Endowments Department) ఇన్చార్జి నల్లగొండ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కార్య నిర్వహణ అధికారి కిరణ్ శర్మ, వారి సిబ్బంది కమలాకర్ రవీందర్ విచ్చేసినారు.
కార్యనిర్వహణాధికారి కిరణ్ శర్మ ఆలయాలలో ధూపదీప నైవేద్యం సమర్పించి గ్రామాలను సుభిక్షంగా ఉంచాలని విధిగా అర్చకులు తమ తమ విధులను నిర్వర్తించాలని అర్చకులను ఉద్దేశించి మాట్లాడినారు. సమావేశంలో రెండు మండలాల ధూపదీప నైవేద్యం మండల అధ్యక్షుడు నాగరాజు రమేష్ తో పాటు వివిధ ఆలయాల అర్చకులు హాజరైనారు.