పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి
ముగ్గురు పేకాటరాయుళ్లు అరెస్ట్...
బాన్సువాడ నవంబర్ 3 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం(Banswada Mandal) లోని కొత్తబాది గ్రామ పరిధిలోని సంతోష్ నగర్ గ్రామ సమీపంలో గల బహిరంగ ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బాన్సువాడ పోలీసులు మంగళవారం సాయంత్రం మెరుపు దాడి నిర్వహించారు.
ఈ దాడిలో పేకాట ఆడుతున్న మాలోత్ చందర్, మేఘావత్ ప్రకాష్, దేవ్ సోత్ శ్రీహరి అనే ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి పేకాటకు సంబంధించిన నగదు రూ.3,200/-, రెండు సెల్ఫోన్లు రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై బాన్సువాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టడం జరిగింది.
ప్రజలు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని, ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని బాన్సువాడ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడును.సెల్ 8712686167. కు సంప్రదించగలరు.