జూలపల్లి పాఠశాల విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు

03-11-2026 | 10:22pm

లోపాలున్న విద్యార్థులకు కళ్లద్దాల పంపిణీ

మహమ్మదాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): మండల పరిధిలోని జూలపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం ఉచిత కంటి వైద్య పరీక్షలు(Free Eye Exams) నిర్వహించారు. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు కంటి పరీక్షలు చేశారు. కంటి చూపులో లోపాలు ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి కళ్లద్దాలు పంపిణీ చేయనున్నట్లు ఆప్తాలిక్ అసిస్టెంట్ రామ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రవికిరణ్, దివాకర్ రెడ్డి, గోపాల్, విష్ణుకుమార్, ఆశప్ప, రమేష్ కబీర్, భాస్కరమూర్తి, రామచంద్రయ్యతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు