కరువు పరిస్థితులపై ముందస్తు చర్యలు చేపట్టాలి
ఎమ్మెల్యే జీఎంఆర్
దేవరకద్ర : ఎల్నినో ప్రభావం(impact of El Niño), కరువు పరిస్థితుల నేపథ్యంలో తాగునీరు, వ్యవసాయం, గ్రామీణ ఉపాధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో(MLA Camp Office) వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించాలని, గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ దమయంతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.