అర్హులైన లబ్ధిదారులకే ఇళ్లు కేటాయించాలి

03-11-2026 | 10:08pm
  1. నిరుపేదలకు ఇండ్లు అందజేయాలని దృడ సంకల్పంతో మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దశాబ్దాల కళ నేరవేరే వేళాయే
  2. మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్

హుజూర్ నగర్, నవంబర్ 3: ఫనిగిరిగుట్ట వద్ద ప్రజా ప్రభుత్వం(People's Government) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ కాలనీ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకే మంజూరు చేయాలని హుజూర్ నగర్ మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్ కోరారు. మంగళవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీఓ శ్రీనివాసులు, మున్సిపల్ కౌన్సిలర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.

.ఇటీవల అధికారులు ప్రకటించిన 1434 మంది అర్హుల జాబితాతో పాటు అనర్హుల జాబితాపై సమావేశం నిర్వహించారు. మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఇండ్లు లేని అర్హులకే  కేటాయించాలని అర్హత ఉన్నవారికి మరో సారి అవకాశం కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ కోతి సంపత్ రెడ్డి,కౌన్సిలర్లు మంజులహరిబాబు ,పద్మరాంరెడ్డి, కవితబాబురావు, భానుఉపేందర్, కృష్ణ,అమర్, తదితరులు, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు