ఆగని ఇసుక అక్రమ తవ్వకాలు

19-10-2026 | 05:20am
  1. ఊకచెట్టు వాగులో ఇసుక తరలింపుతో భూగర్భ జలాలపై ప్రభావం పడుతోందని రైతుల ఆందోళన
  2. పొలాల వద్ద ఇసుక నిల్వలు.. రాత్రివేళల్లో ఇతర ప్రాంతాలకు తరలింపు
  3. అర్థరాత్రి తనిఖీలు చేచేస్తున్నాం : తహసీల్దార్ ఎల్లయ్య 

చిన్నచింతకుంట, అక్టోబర్ 18(విజయక్రాంతి): మండల పరిధిలోని మద్దూర్ గ్రామ శివారులోని ఊకచెట్టు వాగులో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. వాగులోని ఇసుకను యంత్రాలు, ట్రాక్టర్ల సహాయంతో తవ్వి, సమీప వ్యవసాయ పొలాల వద్ద నిల్వ ఉంచి, అక్కడి నుంచి రాత్రివేళల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

భూగర్భ జలాలపై ప్రభావం పడుతుందనే ఆందోళన వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, బావులు, బోరుబావుల్లో నీటి లభ్యత తగ్గడంతో సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాగులో ఇసుకను అధికంగా తవ్వడం వల్ల నీటి నిల్వలు, భూగర్భ జలాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. పంటలు ఎండిపోకుండా కాపాడుకోవడం కష్టంగా మారుతోందని, భవిష్యత్తులో తాగునీటి సమస్య కూడా తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.

అక్రమ రవాణాకు అడ్డుకట్ట కొనసాగేనా? 

ఊకచెట్టు వాగును పరిరక్షించేందుకు రెవెన్యూ, గనుల శాఖ, పోలీసు అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. వాగులో ఇసుక తవ్వకాలను నియంత్రించి, అక్రమ రవాణాను అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు స్పందించకపోతే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఒకమారు తనిఖీలు చేపట్టి సీట్ చేశామని చెప్పుకుంటే సరిపోదు నిరంతర పర్యవేక్షణ ఉంటేనే అడ్డుకట్ట వేయడం జరుగుతుందని రైతులు కోరుతుండ్రు.

మద్దూరులో అర్ధరాత్రి రెవెన్యూ అధికారుల దాడులు 15 ఇసుక బండ్లు సీజ్.. అక్రమ డంపింగ్ స్థావరాల నిర్వీర్యం

మండల పరిధిలో అక్రమ ఇసుక డంపిం గ్లు, నిల్వలపై రెవెన్యూ అధికారులు అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు చేపట్టారు. స్థానికులు, విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారంతో రెవెన్యూ, పోలీసు బృందాలు సంయుక్తంగా ఈ దాడు లు నిర్వహించినట్లు తహసీల్దార్ తెలిపారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వర కు మద్దూరు, అల్లీపూర్, పల్లమ ర్రి, లాల్కోట తదితర ప్రాంతా ల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.

అల్లీపూర్ పరిసరాల్లో సు మారు 15 ఇసుక బండ్లను అడ్డుకుని సీజ్ చేశారు. అక్రమ డంపింగ్ స్థావ రాల వద్ద ఉన్న గుంజలను తొలగించడంతో పాటు పారలు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ట్రాక్టర్లు, ఇతర వాహనాల టైర్లలో గాలి ని తొలగించి అక్రమ స్థావరాలను నిర్వీర్యం చేశారు.

ఈ తనిఖీల్లో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సిబ్బందితో పాటు ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. మండలంలో అనుమతులు లేకుండా ఇసుక తరలించినా, అక్రమంగా నిల్వలు ఉంచినా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తుండ్రు.

మరిన్ని వార్తలు