భక్తిశ్రద్ధలతో శ్రావణమాసానికి వీడ్కోలు
11-09-2026 | 07:31pm
మహమ్మదాబాద్: పవిత్రమైన శ్రావణమాసం నేటితో ముగియడంతో మహమ్మదాబాద్ మండలవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. నెలరోజులుగా శ్రావణమాస(shravan masam) పర్వదినాలను పురస్కరించుకుని ఆయా గ్రామాల్లోని ఆలయాలు భక్తజన సందోహంతో కిక్కిరిశాయి. భక్తులు శ్రద్ధాభక్తులతో ఇష్టదైవాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శ్రావణమాసంలోని సోమ, శనివారాల్లో పలువురు భక్తులు ఉపవాస దీక్షలు చేపట్టి భగవంతుడిని కొలిచారు. ఆలయాల్లో నిత్య పూజలతోపాటు భజనలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించడంతో పల్లెల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నెలరోజుల పాటు భక్తి పారవశ్యంలో దైవారాధన చేసిన భక్తులు శ్రావణమాసానికి భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు.