ఈనెల 17న కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

15-09-2026 | 06:05pm

బోథ్,(విజయక్రాంతి): ఈనెల 17న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) చిత్రపటానికి అన్ని మండల కేంద్రాల్లో పాలాభిషేకం చేయాలని స్థానిక ఎమ్మెల్యే జాదవ్ అనిల్(MLA Jadhav Anil) పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆరు శాతం ఉన్న రిజర్వేషన్ల(Reservations)ను ఎస్టీలకు 10 శాతానికి పెంచి మూడు సంవత్సరాలు పూర్తవుతుందన్నారు.

అంతేగాక 500 కుపైగా జనాభా ఉన్న గూడెలన్నింటినీ గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసి అభివృద్ధికి కృషి చేశారన్నారు.. ఆయన కృషి వల్ల గిరిజనులు ఎంతోమంది సర్పంచులుగా గెలుపొంది వారి చేతికి గ్రామ పాలన అందించారన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ నారాయణరెడ్డి తో పాటు సర్పంచ్ల సంఘం అధ్యక్షులు డాక్టర్ స్వామి  మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్ నాయకులు ఎలుక రాజు రమణ గౌడ్ సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు

మరిన్ని వార్తలు