భారత్ మోడల్.. ఆ దేశాలకూ ఆదర్శం!

27-11-2026 | 08:27am

భారత్ ఐడియాపై దక్షిణాఫ్రికా ఆసక్తి.. అసలేంటీ ‘వన్ గ్రిడ్’?

న్యూఢిల్లీ: భారత్ అమలు చేస్తున్న ‘One Grid’ మోడల్ ఇప్పుడు దక్షిణాఫ్రికా దేశాలకు కూడా ఆదర్శంగా మారే అవకాశం కనిపిస్తోంది. పొరుగు దేశాలతో విద్యుత్‌ను పరస్పరం పంచుకునే భారత విధానాన్ని దక్షిణాఫ్రికా, దాని సరిహద్దు దేశాల్లోనూ అమలు చేయవచ్చని దక్షిణాఫ్రికాలో భారత హైకమిషనర్ ప్రభాత్ కుమార్ సూచించారు. జోహన్నెస్‌బర్గ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ విట్‌వాటర్స్‌రాండ్‌లో జరిగిన కార్యక్రమంలో భారత National Power Training Institute (NPTI), Wits Business School (WBS) మధ్య Memorandum of Understanding (MoU) కుదిరింది. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభాత్ కుమార్.. భారత్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ మధ్య విద్యుత్ సరఫరా విధానం విజయవంతంగా కొనసాగుతోందని వివరించారు. ముఖ్యంగా Monsoon Season సమయంలో, ఆ తర్వాత కూడా ఆయా దేశాలు పరస్పరం విద్యుత్‌ను సరఫరా చేసుకోవడం వల్ల అందరికీ ప్రయోజనం కలుగుతోందన్నారు.

దక్షిణాఫ్రికాలో భాగంగా ఉన్న లెసోతోలో Hydropower ప్రాజెక్టులపై కొన్ని సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని, బోట్స్వానాలోనూ ఓ Power Plant నిర్మాణంలో ఉందని ఆయన పేర్కొన్నారు. భారత ‘One Grid’ Modelను దక్షిణాఫ్రికా పొరుగు దేశాలైన లెసోతో, బోట్స్వానా, నమీబియాలో అమలు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఈ విధానం అమల్లోకి వస్తే ప్రాంతీయంగా విద్యుత్ అవసరాలను తీర్చుకోవడంతో పాటు Energy Sharingకు కొత్త మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు