OTTలోకి వచ్చేసిన ‘ఆదర్శ కుటుంబం’

27-11-2026 | 08:02am

థియేటర్లలో సందడి చేసిన వెంకీ మూవీ.. ఇప్పుడు ఇంట్లోనే!

విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్! థియేటర్లలో ప్రేక్షకులను అలరించిన ‘ఆదర్శ కుటుంబం.. హౌస్ నంబర్ ఏకే 47’ సినిమా ఇప్పుడు OTTలోకి వచ్చేసింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ Family Action Entertainer నవంబర్ 27 అర్ధరాత్రి నుంచి Netflixలో Streamingకు అందుబాటులోకి వచ్చింది. దీంతో థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే ఈ సినిమాను ఎంజాయ్ చేయవచ్చు.

అక్టోబర్ 30న గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాలో వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్, సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. శ్రీనిధి శెట్టి, డింపుల్ హయతీ, నివేదా పేతురాజ్ గ్లామర్‌తో పాటు త్రివిక్రమ్ డైలాగులు, థమన్ మ్యూజిక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని బాగానే ఎంజాయ్ చేశారు. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ సినిమా డిజిటల్ Streaming Rightsను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం రూ.40 కోట్లకు పైగా వెచ్చించినట్లు సమాచారం.

హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో రావు రమేశ్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, రఘుబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 100 కోట్ల లాటరీ చుట్టూ తిరిగే కథలో కామెడీ, యాక్షన్, ఎమోషన్స్‌ను మేళవించారు. థియేటర్లలో ప్రేక్షకులను ఓ మోస్తరుగా అలరించిన ‘ఆదర్శ కుటుంబం’ ఇప్పుడు OTTలో ఎలాంటి Response అందుకుంటుందో చూడాలి.

మరిన్ని వార్తలు