తిరుపతి కార్పొరేషన్ వద్ద హైటెన్షన్
18-10-2026 | 11:11am
తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ మేయర్ అభ్యర్థి వాసుదేవ తన తల్లితో కలిసి కార్యాలయం వద్ద బైఠాయించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించాలని అధికారులను కోరారు.
ఈ సందర్భంగా వాసుదేవ్ యాదవ్ తల్లి మాట్లాడుతూ, తన కుమారుడి బాధ్యత కలెక్టర్దేనని అన్నారు. నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.