ప్రొఫెషనల్స్‌ను ఏకం చేయాలి
- దేశవ్యాప్తంగా ఏఐపీసీని బలోపేతం కావాలి
- రాహుల్‌గాంధీతో ఏఐపీసీ చైర్‌పర్సన్ మధుయాష్కీ భేటీ
హైదరాబాద్, అక్టోబర్ ౫ (విజయక్రాంతి) : ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్‌పర్సన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్(Madhu Yashki Goud) సోమవారం ఢిల్లీలోని 10 కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో(Rahul Gandhi) సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా ఏఐపిసి భవిష్యత్ కార్యాచరణ(AIPC's Future Action Plan), సంస్థాగత విస్తరణ తదితర అంశాలపై చర్చించారు. రాహుల్‌గాంధీ ఆలోచనలకు అనుగుణంగా ప్రొఫెషనల్స్‌ను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడమే ఏఐపిసి ప్రధాన లక్ష్యమపొ మధుయాష్కీ తెలిపారు.
ఇందుకోసం వచ్చే ఏడాది కాలానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. 6 నెలల్లో అన్ని రాష్ట్రాల్లో ఏఐపీసీని బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని స్థాయిల్లో కమిటీలను నియమించనున్నట్లు తెలిపారు. ప్రొఫెషనల్స్‌ను ఏకం చేయడంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.
అన్నిరంగాల నిపుణులకు ప్రాతినిధ్యం..
డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, ఆర్కిటెక్టులు, టీచర్లు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, ఐటీ నిపుణులు(IT professionals), ఆర్టిస్టులు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు, స్కిల్, గిగ్ వర్కర్స్ సహా అన్ని రంగాల నిపుణులను ఏఐపీసీలో భాగస్వాములను చేయాలని రాహుల్ గాంధీ సూచించినట్లు మధుయాష్కీ తెలిపారు. మధ్య, ఎగువ మధ్యతరగతి కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏఐపీసీ అధ్యయనం చేస్తుందని చెప్పారు. విద్య, వైద్యం, ఉద్యోగాలు, గృహ నిర్మాణం, జీవన వ్యయం, పన్నుల భారం, ఉద్యోగ భద్రత, పిల్లల భవిష్యత్ వంటి అంశాలపై వాస్తవాలు, డేటా ఆధారంగా ప్రత్యామ్నాయ విధానాలను రూపొందిస్తామన్నారు.
యువత, గ్రాడ్యుయేట్లు, ఉద్యోగార్థులు, స్టార్టప్‌ల ప్రొఫెషనల్స్‌తో చర్చించి వారి సమస్యలను తెలుసుకుం టామని తెలిపారు. ప్రతి రంగానికీ ఎక్స్‌పెక్ట్ కమి టీ, పాలసీ రీసెర్చ్ గ్రూప్ ఏర్పాటు చేసి ప్రొఫెషనల్స్ నైపుణ్యాన్ని ప్రజా విధానాల రూపకల్పనలో వినియోగిస్తామని తెలిపారు. క్వాలిటీ పాలిటిక్స్‌తో పాటు క్వాలిటీ పాలసీ మేకింగ్ అవసరమన్నారు. నిపుణుల ఆలోచనలు, పరిశోధన, అనుభవం ప్రజలకు ఉపయోగపడాలని పేర్కొన్నారు. భారత జాతీయోద్యమంలో న్యాయవాదులు, వైద్యులు, విద్యావేత్తలు, ఇతర నిపుణులు కీలకపాత్ర పోషించిన విషయాన్ని గుర్తుచేశారు.
1885లో కాంగ్రెస్ స్థాపన నుంచే విద్యావంతులు, న్యాయవాదులు, సామాజిక నాయకులు ప్రజాజీవితంలో కీలకంగా పనిచేశారని తెలిపారు. మహాత్మా గాంధీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ భాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ తదితరులు కాంగ్రెస్‌ను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. డాక్టర్ అం బేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో ప్రధాన భూమిక పోషించారని, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువలు, సామాజిక న్యాయం పరిరక్షణలో నేటి ప్రొఫెషనల్స్ కూడా చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రోగ్రామ్ రెండో బ్యాచ్‌ను 100మంది ప్రొఫెషనల్స్‌తో విస్తరించినట్లు మధుయాష్కీ తెలిపారు. ఏడాదిపాటు రాష్ట్రాల పర్యట నలు, స్థానిక కమిటీల ఏర్పాటు, సమావేశాలు, పాలసీ డైలాగ్స్ నిర్వహిస్తామని వెల్లడించారు.