సర్ప్రైజ్ చేసే ‘మెట్రోలవర్’
నరేన్ వనపర్తి, సాహితీ అవంచ(Naren Vanaparthi and Sahithi Avancha) ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘మెట్రో లవర్(Metro Lover)’. మహేశ్ నాంపెల్లి దర్శక త్వంలో కేఎంసీ ప్రొడక్షన్స్, ఈగిల్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై మాల్య కందుకూరి, శివకుమార్ రాజంపేట, గడ్డం రవికుమార్, సంతోష్ జాదవ్ నిర్మిస్తున్నారు. నవంబర్ 20న రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన(Trinadha Rao Nakkina) ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. “మెట్రో లవర్’ సినిమా చూశాను.
నరేన్ చాలా ప్యాషన్‌తో చేశాడు. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు. ‘ఇది నెక్స్ లెవల్ స్టోరీ. సినిమా చూసి చాలా సర్ప్రైజ్ అవుతారు’ అని హీరో నరేన్ తెలిపారు. డైరెక్టర్ మహేశ్ నాంపల్లి మాట్లాడుతూ.. “సినిమా అంచనాలకు మించి ఉంటుంది. ఇలాంటి కథ ఇప్పటివరకు రాలేదు” అని చెప్పారు. ‘సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. చాలా మంచి కొత్త కథ’ అని నిర్మాతలు అన్నారు. ఈ వేడుకలో మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్, బెక్కం వేణుగోపాల్ కూడా మాట్లాడారు.