ఇల్లు కావాలా..? ఇందిరమ్మ టవర్స్‌ రెడీ

06-10-2026 | 07:16am

హైదరాబాద్‌లోని గాజులరామారం (Gajularamaram)లో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల (Indiramma Housing Towers) నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఉదయం 10 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందిరమ్మ టవర్స్ పథకంలో ఇది రెండో విడత (Second Phase)గా చేపడుతున్న నిర్మాణ కార్యక్రమం. ఏడాదిలోపే నిర్మాణ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందజేస్తామని మంత్రి ఇప్పటికే ప్రకటించారు.

కాగా, ఈ పథకంలో తొలి విడతగా నాంపల్లి రెడ్‌హిల్స్‌లో (Red Hills) ఇప్పటికే శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. తాజా కార్యక్రమంతో గాజులరామారంలోనూ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.

మరిన్ని వార్తలు