‘ఫ్లుదుబాయ్’ని కూల్చాలనుకున్నా
- విధుల్లో చేరకముందే దాడికి ప్రణాళిక రచించా
- విచారణలో ఒప్పుకున్న కోపైలట్ అల్ హమామీ
- మరింత విచారణ చేస్తున్న అధికారులు
దుబాయ్, అక్టోబర్ 5: గత నెల 30న ఫ్లైదుబాయ్ విమానంలో(flydubai aircraft) పైలట్ స్మిత్ మచ్చర్‌పై(Pilot Smith Matcher) దాడికి పాల్పడిన కోపైలట్ హమామ్ అల్ హమామీ(Co-pilot Hammam Al Hammami) విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. తాను ఉద్దేశపూర్వకం గానే విమానాన్ని కూల్చివేయాలని ప్రయత్నించానని చెప్పాడు. ఫిబ్రవరిలో దుబాయ్ ఆధారిత విమానయాన సంస్థలో(Dubai-based airline) చేరిన హమామ్ అల్ హమామీ సెప్టెంబర్ 30న దుబాయ్-టెల్ అవీవ్ విమానం ఎఫ్‌జడ్ 1073ను టెల్ అవీవ్‌లోని ఒక ఆకాశహర్మ్యంపై లేదా బెన్ గురియన్ విమానాశ్రయంపై కూల్చివేయడం ద్వారా 9/11 తరహా దాడికి ప్రణాళిక రచించినట్లు అధికారుల దర్యాప్తులో వెల్లడైంది.
ఫ్లైదుబాయ్‌లో చేరకముందే తాను సెప్టెంబర్ 30 దాడికి ప్రణాళి క రచించానని అల్ హమామీ యూఏఈ దర్యాప్తు అధికారులకు చెప్పినట్లు తెలిసింది. ఫ్లైదుబాయ్‌లో పనిచేస్తున్నప్పుడు అల్ హమామీ ఇటీవలి నెలల్లో బెన్ గురియన్ విమానాశ్రయాన్ని పలుమార్లు సందర్శించాడని అధికారుల విచారణలో వెల్లడైంది. జూన్‌లో జరిగిన ఒక పర్యటన సందర్భంగా, అతను సమాచారాన్ని సేకరించి దాడికి ప్రణాళిక రచించాడు. ఫ్లు దుబాయ్ విమానాన్ని నడుపుతున్న ఇద్దరు పైలట్లలో ఒమన్ కు చెందిన కోపైలట్ హమామ్ అల్ హమ్మా మీ భారతదేశానికి చెందిన ప్రధాన పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడు.
అయితే గొడ్డలితో దాడి చేసిన కోపైలట్‌ను సిబ్బంది, ప్రయాణికులు సాహసోపేతంగా బంధించారు. ఈ ఘటనలో కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ వీరోచితంగా పోరాడి ప్రయాణికులను కాపాడారు. కెప్టెన్‌ను హతమార్చి, విమానాన్ని ఇజ్రాయెల్ లోని బెన్ గురియన్ విమానాశ్రయంపై లేదా టెల్ అవీవ్‌లోని ఆకాశహర్మ్యాలపై కూల్చివేయాలని పథకం రచించినట్లు యూఏఈ అధికారుల విచారణలో నిందితు డు అంగీకరించాడు. తలకు బలమైన గాయమైనప్పటికీ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్ అత్యంత ధైర్యసాహసాలతో ప్రతిఘటించారు.
ఆయ న వెంటనే ఎమర్జెన్సీ సిగ్నల్స్ పంపడంతో పాటు కాక్‌పిట్ తలుపును తెరిచారు. దీంతో అప్రమత్తమైన విమాన సిబ్బంది, ప్రయాణికులు కలిసి కో-పైలట్‌ను నిలువరించి బంధించారు. అనంతరం విమానంలో ప్రయాణిస్తు న్న ఇద్దరు ‘ఆఫ్-డ్యూటీ’ పైలట్ల సహాయంతో విమానాన్ని సౌదీ అరేబియాలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. హమామ్ అల్-హమామి తీవ్రవాద భావజాలంతో ప్రభావితమైనట్లు, అల్-ఖైదాకు మద్దతుగా ఆన్‌లైన్‌లో పోస్టులు పెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
కేవలం టెల్ అవీవ్‌పై దాడి చేయాలనే లక్ష్యంతోనే తాను ఫ్లైదుబాయ్ సంస్థలో చేరినట్లు అతడు వెల్లడించడం గమనార్హం. ఈ దాడి కోసం గత కొన్ని నెలలుగా అతడు సమాచారం సేకరించినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు పేర్కొన్నాయి. గత జులైలోనే ఈ దాడికి ప్రణాళిక వేసినప్పటికీ, అది విఫలమైందని విచారణలో వెల్లడైంది. ఈ ఘటనతో పైలట్ల నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న భారీ భద్రతా లోపాలు బహిర్గతమయ్యాయి.
తీవ్రవాద భావజాలం కారణంగా స్వదేశమైన ఒమన్‌లోనే విమానాలు నడపకుండా నిషేధానికి గురైన వ్యక్తికి ఫ్లైదుబాయ్ యాజమాన్యం ఎలా ఉద్యోగం ఇచ్చిందనే అంశంపై ప్రస్తుతం లోతైన విచారణ జరుగుతోంది. ప్రస్తుతం హమామీని పలు కోణాల్లో అధికారులు విచారిస్తున్నారు. ముఖ్యగా హమామీ సోషల్ మీడియా కార్యకలాపాలపైనా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఉగ్రదాడి కేసుగా దర్యాప్తు జరుపుతున్నారు.