ఈ కాలపు స్టుల్.. జైలర్2

06-10-2026 | 05:30am

సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth) ‘జైలర్ 2’ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్ హై-వోల్టేజ్ యాక్షన్(High-voltage action), రజనీ కాంత్ స్టైల్, కామెడీ, యాటిట్యూ డ్‌తో ప్రేక్షకుల్లో భారీ అంచనా లను పెంచుతోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్(Nelson Dilipkumar) తనదైన క్విర్కీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ‘జైలర్’(‘Jailer’) ప్రపంచాన్ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ‘అవన్నీ మీ నాన్న కాలపు స్టుల్.. కానీ ఈ కాలపు స్టుల్ శత్రు వుంలందరినీ ఒకేచోటుకి పిలిపించి, అక్కడే బాంబ్ పెట్ట డం..’ అంటూ ముత్తువేల్ పాండియన్‌గా రజనీ మరోసారి తనదైన స్టైల్, మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో మెప్పించనున్నారు.

ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, విద్యాబాలన్, శివరాజ్‌కుమార్, మోహన్‌లాల్, రమ్యకృష్ణ, యోగిబాబు, సూరజ్ వెంజారమూడు, మిర్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. ఆర్ నిర్మల్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 15న విడుదల కానుంది. 

మరిన్ని వార్తలు